ఆల్‌బుఖారా!

ఆల్‌బుఖారా పేరు వినగానే.. నోట్లో నీళ్లూరుతాయి. వగరుగా, తియ్యగా, ఉండే ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జ్వరంతో బాధపడేవారు ఈ పండు తింటే తక్షణ శక్తి వస్తుంది. ఇంకా ఈ పండు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

-ఆల్‌బుఖారాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. -ఇందులోని సొర్బిటాల్, ఇసోటిన్ కాంపౌండ్లు జీర్ణశక్తిని క్రమబద్ధీకరించి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. -ఈ పండులో పుష్కలంగా లభించే సి విటమిన్ ద్వారా రోగ నిరోధకశక్తి పెరిగి, ఇన్ఫెక్షన్లు, అల్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. -శ్వాస సంబంధ క్యాన్సర్లకు ఆల్‌బుఖారా చెక్ పెడుతాయి. -ఆస్తమా, ఆర్థరైటిస్, గుండెపోటు, క్యాన్సర్ నివారణకు ఈ పండ్లు దోహదపడుతాయి. -ఇందులో అధిక మోతాదులో ఉండే ఫోలిక్ యాసిడ్, కాల్షియం గర్భిణులకు, పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. -చర్మ నిగారింపును ఈ పండ్లు మెరుగు పరుస్తాయి.