చంద్రుణ్ణి దగ్గరగా చూశాను!

షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జీరో. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకుడు. కత్రినాకైఫ్, అనుష్కశర్మ కథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పోస్టర్స్‌ను షారుఖ్‌ఖాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఎంతోమంది నక్షత్రాలను చూడాలని స్వప్నిస్తారు. కానీ నేను చంద్రుణ్ణి చాలా దగ్గరి నుంచి చూశాను. జీరో సినిమా సాకారం కావడానికి తనవంతు సహకారాన్నందించిన సహృదయురాలైనా నా మిత్రురాలు కత్రినాకైఫ్‌కు కృతజ్ఞతలు అంటూ కత్రినాకైఫ్‌తో కలిసి ఉన్న ఫొటోకు క్యాప్షన్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత షారుఖ్‌ఖాన్ నటిస్తున్న జీరో చిత్రంపై బాలీవుడ్‌లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ బువా సింగ్ అనే మరుగుజ్జు పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది.

Related Stories: