అవకాడో ఎంతో మేలు!

అవకాడోను ఆరునెలల పాటు క్రమం తప్పకుండా తింటే వృద్ధుల కళ్లలో ల్యూటిన్ ప్రమాణాలు పెరుగుతాయి. అంతేకాదు, ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

అవకాడో ప్రతిరోజు తినడం వల్ల వృద్ధుల కంటి ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆరునెలల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు అవకాడోను తింటే వృద్ధుల కళ్లలో ల్యుటిన్ ప్రమాణాలు పెరుగుతాయి. దాంతో మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ ల్యుటిన్ పండ్లు, కూరగాయలలో ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల పెరిగిన ల్యుటిన్ మెదడు, కళ్లలోకి చేరుతుంది. ల్యుటిన్ యాంటీ ఇన్‌ప్లమేటరీ ఏజెంటు మాత్రమే కాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రతా శక్తి పెరగడాన్ని కూడా గుర్తించవచ్చు. అవకాడో తినని వారిలో కాగ్నిటివ్ సామర్థ్యం తక్కువగా పెరగడాన్ని పరిశోధకులు గమనించారు. అవకాడో మెదడు ఆరోగ్యాన్నే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సప్లిమెంట్స్ తినే వారితో పోలిస్తే తాజా అవకాడో తిన్న వాళ్ల కళ్లలో ల్యుటిన్ ప్రమాణాలు రెట్టింపుగా ఉంటాయి. వృద్ధుల కంటిని, మెదడుని ఆరోగ్యంగా ఉంచేందుకు దివ్యౌషధంగా సహాయ పడుతుంది. ఇంకెందుకు, ఆలస్యం బాగా తిని ఆరోగ్యంగా ఉండండి.