అర్థం- పరమార్థం

పుణ్యం వర్ధతాం శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తిశివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు.

పెళ్లిలో తలంబ్రాలు క్రతువుకు చాలా ప్రత్యేకత ఉంది. తలపై పోసే ప్రాలు (బియ్యం) కాబట్టే, తలంబ్రాలు అంటారు. ఇదొక అక్షతాస్నానం. మంగళసూత్రధారణ తర్వాతి ముఖ్యఘట్టమిది. పురోహితుడు వధూవరులను ఆశీర్వదిస్తున్న తీరు ఇది. పుణ్యం, శాంతి, పుష్టి, తుష్టి వంటివన్నీ వృద్ధి చెందాలని, విఘ్నాలు తొలగాలని, ఆయురారోగ్యాలు సిద్ధించాలని, క్షేమం-మంగళం కలగాలని, శుభకర్మలు వృద్ధి చెందాలనే దీవెనలివి.