అర్థం- పరమార్థం

ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్

హైందవ వైవాహిక క్రతువుల్లో బ్రహ్మముడి ప్రాధాన్యం సుస్థిర దాంపత్య జీవనాన్ని ఉద్బోధిస్తుంది. వధువు చీర అంచునీ, వరుని ఉత్తరీయం అంచునీ కలిపి ముడి వేయడాన్ని బ్రహ్మముడి (కొంగుముడి) అంటారు. ఈ సందర్భంలోనే పురోహితుడు చదివే మంత్రార్థంలో అంతే పరమార్థం దాగి ఉంది. ఈ దాంపత్య సామ్రాజ్యాన్ని ధరించే మీకు వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు, అగ్నిదేవతలు నిశ్చలత్వాన్ని కలుగ జేయుదురు గాక.