అమ్మ ఆయుష్షే బిడ్డకు రక్ష!

తల్లి జీవితకాలాన్ని బట్టి బిడ్డ ఆరోగ్యం, ఆయుష్షూ ఆధారపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. తల్లి తక్కువ కాలం జీవించి ఉన్నట్లయితే ఆ ప్రభావం బిడ్డ జీవితకాలంపై కూడా ఉంటుందంటున్నారు. ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ కాలం బతికి ఉంటే అది వారసత్వంగా బిడ్డలకు అందుతుందనీ చెప్తున్నారు.

తల్లి 90 సంవత్సరాల వరకు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి ఉంటే తన కూతురు అంతకంటే మెరుగైన ఆయుష్షుతో, ఆరోగ్యంతో ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి చెప్తున్నది. ఎలాంటి జబ్బులు కూడా దరిచేరవట. 90 ఏళ్లలో కూడా ఆరోగ్యంగా ఉన్న తల్లుల జీవనశైలిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం గురించి పరిశోధకుడు అల్లావుద్దీన్ షాద్యబ్ మాట్లాడుతూ.. మహిళల జీవితకాలం రోజురోజుకూ తగ్గిపోతున్నది. దీనిపై వారి జీవనశైలి ప్రభావం ఉన్నట్టే తల్లి జీవితకాలం కూడా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఒకావిడ తొంబైయేండ్లు మెరుగైన ఆరోగ్యంతో బతికి ఉందనుకోండి.. ఆమె కూతురు గర్భ ధారణ, ప్రసవం, ఆరోగ్యం, జీవన విధానం దానిపై ఆధారపడి ఉంటాయి. తల్లి ఏ అనారోగ్య సమస్యల్లేకుండా బతికితే తన బిడ్డ ఆమె కంటే 23% మెరుగైన ఆయురారోగ్యాలతో బతుకుతుంది అని నిపుణులు చెప్తున్నారు.