అభినందనీయుడు సీఎం కేసీఆర్

ఎన్నో అవమానాలకు, అణిచివేతలకు గురైన తెలంగా ణ స్వపరిపాలనలో తలెత్తుకొని తిరుగుతున్నది. యావత్ దేశం తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుంటుండటమే దీనికి ఉదాహరణ. ఇందుకు కారణం ఉద్యమకారుడు, అపర భగరీథుడైన సీఎం కేసీఆర్ పాలనాతీరు అనడంలో సందేహం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అణిచివేయబడిన వృత్తి కులాలకు ప్రోత్సాహం ఇస్తూ కనుమరుగైన కులాలను మళ్లీ వృద్ధిలోకి తీసుకోవాలని ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది. గత పాల కుల పుణ్యమాని తెలంగాణ ప్రాంతంలో స్వర్ణకార వృత్తి అంధకారంలోకి పోయింది. చేసేందుకు పనులు లేక స్వర్ణ కారులు సెనైడ్ తాగి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కుటుంబ పెద్ద దిక్కే తనువు చాలించడంతో వీధినపడ్డ కుటుంబాలె న్నో. బడా కంపెనీల యాంత్రీకరణ విధానాల కారణంగా స్వర్ణకార వృత్తి కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. దీంతో వలసలు పోయి కూలీలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలోనే తెలంగాణ ఆవిర్భవించడం స్వర్ణ కారులకు వరంగా మారింది.

పాలనాపగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ మొదట కులవృ త్తులకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అందులో భాగంగా నే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. విశ్వ బ్రాహ్మ ణుల అభివృద్ధి గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్ ఇటీవ ల 5 కోట్లతో పాటు విశ్వబ్రాహ్మణ భవనం కోసం హైదరా బాద్ ఉప్పల్ సమీపంలో రెండెకరాల భూమిని కేటాయిం చడం హర్షణీయం. ఈ నేపథ్యంలో వేలాదిమంది విశ్వ బ్రాహ్మణులు సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో జరిగే ప్రగ తి నివేదన సభలో పాల్గొని సీఎం కేసీఆర్‌కు అభినందన లు తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాల నలో ఐదు రాష్ర్టాలు పర్యటించి స్వర్ణకార వృత్తిని అధ్యయ నం చేసిన ఫైమెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం కేసీ ఆర్ పరిశీలించి ఆమోదించాలని కోరుతున్నాం. విశ్వబ్రా హ్మణుల బాగోగుల గురించి ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అభినందనీయులు. - కట్టా సత్యనారాయణా చారి అఖిల భారతీయ స్వర్ణకార సంఘం, ఉపాధ్యక్షులు