మిస్టర్ పర్‌ఫెక్ట్ దొరకడం కష్టమే..

సినిమాల్లో చాలా వరకు ఆధునిక పాత్రల్లో కనిపించినా నేను పాతకాలం మనిషినే. సంప్రదాయాలకు చాలా విలువిస్తాను అని అంటోది రాశీఖన్నా. గత కొంతకాలంగా తెలుగుతో పాటు తమిళ చిత్రసీమపై దృష్టిసారిస్తున్నదీ ఢిల్లీ సొగసరి. నటనకు ప్రాధాన్యం వున్న పాత్రల్ని ఎంచుకుంటూ గ్లామర్‌డాల్ ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నది.సినిమాలతో బిజీగా ఉన్నా కుటుంబానికి తప్పకుండా సమయాన్ని కేటాయిస్తానని చెబుతోంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎలాంటి సమస్య ఎదురైనా కుటుంబ సభ్యులతో చర్చించే ముందడుగు వేస్తానని అంటున్నది రాశీఖన్నా. పెళ్లి పట్ల తన ఆలోచనలన్నీ సంప్రదాయ పద్ధతిలో ఉంటాయని చెబుతోంది. ఆమె మాట్లాడుతూ కాబోయే భర్త విషయంలో నాకు పెద్దగా కోరికలేమీ లేవు. అతను ఇలాగే వుండాలి అనే నిబంధనలేవీ పెట్టుకోలేదు. అందచందాల కంటే మంచి మనసు ముఖ్యం. దయాగుణం, ఆధ్యాత్మిక భావాలు కలిగిఉండాలి. అహంభావ మనస్తత్వం ఉన్న వారంటే నచ్చదు. అయితే నా ఆలోచనలు, ఊహలకు అనుగుణమైన వ్యక్తి ఇప్పటివరకు నాకు ఎదురవ్వలేదు. ఈ ఆధునిక యుగంలో అలాంటి మిస్టర్ పర్‌ఫెక్ట్ దొరకడం కష్టమే. ఒకవేళ భవిష్యత్తులో నచ్చిన అబ్బాయి తారసపడితే అమ్మానాన్నల అనుమతి తీసుకొనే పెళ్లాడతా అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో విజయ్‌దేవరకొండ సరసన ఓ సినిమాతో పాటు తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తున్నది రాశీఖన్నా.