అది పోయింది.. ఇది వచ్చింది

పోయిందెవరు? వచ్చిందెవరు? అని కదా మీ డౌట్! ప్రమాదకర కికీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రాణాలు కూడా గాల్లో కలిశాయి. ఆసుపాత్రుల పాలవుతున్నారని కొన్ని దేశాల్లో అయితే బ్యాన్ చేశారు. కొత్త చాలెంజ్ రావడంతో దాన్నిప్పుడు మరిచిపోయారు. ఏంటీ డెలే అల్లీ? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది?

ఆటలెప్పుడూ వినోదాన్ని, విజ్ఞానాన్ని పెంచాలి కానీ ప్రమాదాన్ని తీసుకురాకూడదు. ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న సరికొత్త డెలే అల్లీ చాలెంజ్ అంత ప్రమాదకరం ఏమీ కాదు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ప్రారంభించాడు కాబట్టి దీనికి అతని పేరే పెట్టారు. ఓరోజు ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు చేతివేళ్లతో ఓ తింగరి పోజిచ్చాడు. కుడిచేతి వేళ్లను మడతపెట్టి(సినిమా తీస్తున్న దర్శకుల రూపంలో) ఒంటికంటితో చూశాడు. తర్వాత రెండు రెండు వేళ్లను రెండు కళ్లతో చూస్తున్నట్టు చూపాడు. ఇదేదో వెరైటీగా ఉందని నెటిజనులు తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫొటోలకు పోజిచ్చి వాటిని సోషల్ నెట్‌వర్క్‌లలో పోస్ట్ చేస్తున్నారు. తన ఫోజుకు ఇంత క్రేజ్ రావడంతో డెలే అల్లీ పోజులు కొడుతూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఇది కూడా వైరల్ అవుతున్నది. ప్రమాదకర ఆట కాకపోవడంతో చాలా మంది ఆడుతున్నారు. ఆలస్యమెందుకు ఓసారి ట్రై చేయొచ్చు.

Related Stories: